చింతపండులో వేడి నీళ్ళు పోసి చిక్కని గుజ్జు తీయండి.
మిక్సీలో అవాల పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి వేడి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక నూనె కలిపి పక్కనుంచుకోండి.
బియ్యం లో నీళ్ళు పసుపు పోసి హై ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి.
ఉడుకుతున్న అన్నంని నెమ్మదిగా కలిపి అన్నం పైన ప్లేట్ పెట్టి నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద 90% ఉడికించుకోవాలి (అన్నం వండే తీరు ఒక సారి టిప్స్లో చూడగలరు).
ఉడికిన అన్నంలో నూనె పోసి నెమ్మదిగా కలిపి వెడల్పాటి గిన్నెలో వేసుకోండి, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు చింతపండు గుజ్జు వేసి నెమ్మదిగా కలుపుకోండి.
తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నూనెలో ఎర్రగా వేపి పులిహోరా లో పోసుకోండి, ఇంకా పైన ఆవాల పేస్ట్ వేసి నెమ్మదిగా పట్టించి 30 నిమిషాల నుండి గంట సేపు వదిలేస్తే అన్నానికి ఉప్పు, పులుపు , ఆవాల పరిమళం పట్టి ఎంతో రుచిగా ఉంటుంది.
చేసే ముందు ఒకసారి టిప్స్ చూసి చేయండి. తప్పక ఆలయాల్లో ఇచ్చే పులిహోర రుచిని ఆస్వాదిస్తారు!!