ఆవకాయ చికెన్ ధం బిర్యానీ

Non Veg Biryanis | nonvegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Resting Time 20 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • బిర్యానీ మసాలా కోసం
  • 1 tsp జీలకర్ర
  • 1.5 tbsp ధనియాలు
  • ½ అనాసపువ్వు
  • 3 లవంగాలు
  • 3 యాలకలు
  • 1/2 ఇంచ్ దాల్చిన చెక్క
  • జాజి కాయ – చిన్న ముక్క
  • 1/2 tsp మిరియాలు
  • 1/2 జాపత్రి
  • చికెన్ నానబెట్టడానికి
  • 1/2 kilo చికెన్
  • 1.5 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • 1 tbsp అల్లం తరుగు
  • బిర్యానీ మసాలా
  • 1/2 cup పెరుగు
  • 1/2 cup వేపిన ఉల్లిపాయలు
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 2 tbsp నూనె
  • బిర్యానీ రైస్ ఉడికించుకోడానికి
  • 2 liters నీళ్ళు
  • 5 యాలకలు
  • 1 అనాసపువ్వు
  • 1 బిర్యానీ ఆకు
  • 1.5 ఇంచ్ దాల్చిన చెక్క
  • 1 tbsp నిమ్మరసం
  • 2 cups బాస్మతి బియ్యం (300 gms)
  • 3 tbsp ఉప్పు
  • 4 చీరిన పచ్చిమిర్చి
  • బిర్యానీ కోసం
  • 3 tbsp నూనె
  • 2 tsp నెయ్యి
  • 1 నల్ల యాలకల
  • 3 యాలకలు
  • 4 లవంగాలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • నానబెట్టిన చికెన్
  • 1/4 cup నీళ్ళు
  • 6 - 7 చీరిన పచ్చిమిర్చి
  • 1/4 cup అన్నం ఉడికించుకున్న నీళ్ళు
  • 3 tbsp వేపుకున్న ఉల్లిపాయ
  • 2 tbsp నూనె
  • 2 tsp రెడ్ ఫుడ్ కలర్
  • ఉడికించుకున్న అన్నం
  • 1/3 cup మామిడి ఆవకాయ పచ్చడి (60 gm)

విధానం

  1. బిర్యానీ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసుకోండి.
  2. చికెన్ నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి చికెన్ని రుద్దుతూ బాగా పట్టించి ఫ్రిజ్లో రెండు గంటలు నానాబెట్టాలి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి అందులో నల్ల యాలక యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క నానబెట్టుకున్న చికెన్ కొద్దిగా నీళ్ళు వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 10 నిమిషఅలౌ మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ మూతపెట్టి ఉడికించుకోవాలి.
  4. 15 నిమిషాలా తరువాత ఆవకాయ్ పచ్చడిలో కాసిని నీళ్ళు పోసి కలిపి పచ్చడిలో వేసుకోండి ఇంకా చీరయిన పచ్చిమిర్చి పావు కప్పు నీళ్ళు పోసి నూనె పైకి తేలేదాక చికెన్ కుక్ చేసుకోవాలి.
  5. నూనె పైకి తేలాక చికెన్ పొయ్యి మీద నుండి దింపేసుకోవాలి.
  6. నీళ్ళలో మసాలా దినుసులు ఉప్పు చీరిన పచ్చిమిర్చి వేసి మరగ కాగానివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యం నిమ్మరసం వేసి హై-ఫ్లేమ్ మీద 70% కుక్ చేసుకోవాలి.
  7. 70% ఉడికిన అన్నాన్ని ఉడికించుకున్న చికెన్ పైన వేసుకోవాలి.
  8. అన్నం మీద రెడ్ ఫుడ్ కలర్, వేపుకున్న ఉల్లిపాయ తరుగు, నూనె, అన్నం ఉడికించుకున్న నీళ్ళు పోసి మైదా పిండి ముద్ద అంచున ఉంచి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ధం చేసి 20 నిమిషాలు వదిలేయాలి. లేదా ఆవిరి బయటకి వేగంగా వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయాలి అని గుర్తుంచుకోండి.
  9. 20 నిమిషాల తరువాత అడుగు నుండి బిర్యానీ తీసి పైన వేపుకున్న ఉల్లిపాయలు వేసి చల్లని రైతాతో సర్వ చేసుకోండి.