వాము చారు

Sambar - Rasam Recipes | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Total Time 17 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • వాము చారు పొడికి
  • 1 tsp వాము
  • 2 ఎండు మిర్చి
  • 1/2 tsp జీలకర్ర
  • 1 tsp ధనియాలు
  • చారు కోసం
  • 1 tsp నూనె
  • 1 ఎండుమిర్చి
  • 1 పచ్చిమిర్చి
  • 5 వెల్లూలి దంచినవి
  • 1/2 liter చింతపండు పులుసు (నిమ్మకాయంత చింతపండు నుండి తీసినది)
  • 1/2 tsp ఆవాలు
  • 1/4 tsp మెంతులు
  • 2 కరివేపాకు
  • రాళ్ళ ఉప్పు
  • 1/4 tsp పసుపు

విధానం

  1. చారు పొడికి కావలసిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పొడి చేసుకోండి.
  2. మూకుడులో నూనె వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు వేసి మెంతులని ఎర్రగా వేపుకోవాలి తరువాత జీలకర్ర, వెల్లూలి వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. చింతపండు పులుసు, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు కాడలతో సహా, పసుపు, వాము పొడి అన్నీ వేసి మీడియం సెగ మీద 15 నిమిషాలు పాటు బాగా మరగనివ్వాలి.
  4. 15 నిమిషాల తరువాత దింపి వేడిగా తాగినా లేదా అన్నంతో, ఇడ్లి తో ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.