ఆలూ వంకాయ కూర

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 250 gm వంకాయ ముక్కలు
  • 150 gm ఆలూ గడ్డ
  • 1 మునక్కాడ
  • 2 ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
  • 3 టమాటో - సన్నని తరుగు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 2 tbsp కొత్తిమీర
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 1 tbsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp జీలకర్ర పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 1/4 cup నూనె
  • 1/2 liter చింతపండు నీళ్లు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో సగం నారా తీసిన మునక్కాడ ముక్కలు వేసి 3-4 నిమిషాలు వేపి తీసుకోండి.
  2. అదే నూనెలో వంకాయ ముక్కలు ఆలు గడ్డ ముక్కలు వేసి వంకాయ మెత్తబడి ఆలూ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసుకోవాలి.
  3. మిగిలిన నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపుకోవాలి, తరువాత ఉల్లిపాయ తరుగు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపుకోవాలి.
  4. మెత్తబడిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోండి, తరువాత ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కొద్దిగా నీళ్లు పోసి కారాలు మాడకుండా వేపుకోవాలి.
  5. వేగిన కారంలో టమాటో తరుగు వేసి టమాటో ముక్కలు గుజ్జుగా అయ్యేదాకా వేపుకోవాలి.
  6. మగ్గిన టమాటోలో వేపిన ఆలూ వంకాయా మునక్కాడ ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి 4 నిమిషాలు మగ్గించుకోవాలి.
  7. నాలుగు నిమిషాలు మగ్గిన తరువాత పలుచని చింతపండు పులుసు పోసి మునక్కాడ మెత్తబడేదాకా మీడియం ఫ్లేమ్ మీద మూతపెట్టి ఉడికించుకోండి.
  8. మునక్కాడ మెత్తబడ్డాక కొత్తిమీర తరుగు గరం మసాలా వేసి కలిపి దింపేసుకోండి.