ఆలూ బటాని మసాలా కూర

Street Food | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 150 gm ఆలూ
  • 1/2 cup బటానీ (కనీసం 6-7 గంటలు నానబెట్టినవి)
  • 3 tbsp నూనె
  • 1 tsp జీలకర్ర
  • 2 ఉల్లిపాయ తరుగు (పెద్దవి)
  • 2 టొమాటో పేస్ట్ (పెద్ద టొమాటోలది)
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • 1/2 tsp పసుపు
  • 1/2 tsp జీలకర్ర పొడి
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1/4 tsp గరం మసాలా
  • నీళ్ళు – ఆలూ బటానీ ఉడికించడానికి
  • 350 ml నీళ్ళు (కూర్మ లోకి)
  • కొత్తిమీర – కొద్దిగా
  • 2 tsp నెయ్యి

విధానం

  1. నీళ్ళలో చెక్కు తీసిన ఆలూ ముక్కలు, బటానీ, పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఆలూని మెత్తగా ఉడికించుకోవాలి.
  2. నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేపి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  3. వేగిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేపుకోవాలి.
  4. తరువాత టొమాటో పేస్ట్ వేసి టొమాటోలోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  5. నూనె పైకి తేలిన తరువాత నీళ్ళు పోసి, మెత్తగా ఉడికిన ఆలూని చిదిమి వేసుకుని హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి
  6. మరుగుతున్న కుర్మా పైన ఏర్పడే నురగని తీసేస్తే కూర్మ చూడడానికి బాగుంటుంది.
  7. 4-5 నిమిషాలు ఉడికిన కూర్మలో ఉడికించిన ఆలూ బటానీ వేసి కలిపి సన్నని సెగ మీద చిక్కబడనివ్వాలి
  8. కూర్మ చిక్కబడ్డాక కొత్తిమీర తరుగు ఉప్పు రుచి చూసి నెయ్యి వేసి కలిపి దింపేసుకోండి.