పిండిలో ఉప్పు నూనె వేసి బాగా రుద్దితే బ్రెడ్ పొడిలా అవుతుంది, ఆ తరువాత తగినన్ని నీళ్ళు చేర్చి పగుళ్లు లేని మృదువైన పిండి ముద్దగా అయ్యేదాక వత్తుకోవాలి, వత్తుకున్నాక 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
ముకుడులో నూనె వేడి చేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, పసుపు వేసి 30 సెకన్లు వేపి, కాలీఫ్లవర్ సన్నని తురుము వేసి చెమ్మారి పచ్చి వాసన పోయేదాక వేపుకోవాలి.
తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి ఆలూలోని చమ్మారి గట్టి ముద్దగా అయ్యేదాక కలుపుతూ వేపుకోండి, దింపేముందు నిమ్మరసం పిండి కలిపి దింపి పూర్తిగా చల్లారనివ్వాలి.
30 నిమిషాల తరువాత నానుతున్న పిండిని 4 భాగాలుగా చేసుకోండి, తరువాత చేత్తో పిండిని పలుచగా సాగదీసి అందులో పూర్తిగా చల్లారిన ఆలూ ముద్ద 3 tbsp పెట్టి అంచులని పైకి లాగి స్టఫ్ఫింగ్ని లోపలికి తోస్తూ గట్టిగా సీల్ చేయాలి.
పొడి పిండి చల్లి పిండి ముద్దని ముందు చేతి వేళ్ళతో లోపలి స్టఫ్ఫింగ్ని సమంగా అన్ని వైపులా సర్ది, నెమ్మదిగా వత్తుకోవాలి.
వత్తుకున్న పరోటాని వేడి పెనం మీద వేసి పొంగనివ్వాలి, పొంగిన తరువాత తిప్పి మరో వైపు కాలనిచ్చి ఆ తరువాత రెండు వైపులా నూనె లేదా వెన్న వేసి ఎర్రగా కాలనిస్తే చాలా రుచిగా ఉంటుంది పరోటా.
ఈ పరోటా కమ్మని చల్లని పెరుగు, ఆవకాయతో చాలా బాగుంటుంది.