ఆలూ మేథీ పరాటా

Rotis Paratha | vegetarian

  • Prep Time 20 Mins
  • Cook Time 15 Mins
  • Resting Time 30 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 cups గోధుమపిండి
  • 1 cup మెంతి కూర ఆకు తరుగు
  • 2 ఉడికించిన ఆలూ
  • 2 పచ్చిమిర్చి - తురుము /పేస్ట్
  • 1/4 tsp నలిపిన వాము
  • 5 వెల్లులి
  • ఉప్పు
  • కొత్తిమీర కొద్దిగా
  • నీళ్లు పిండి తడుపుకోడానికి
  • 1 tbsp పిండిలో కలుపుకోడానికి నూనె
  • 3 tbsps మడతల్లో పూయడానికి నూనె
  • 4 tbsp పరోటాలు కాల్చుకోడానికి నూనె

విధానం

  1. మెత్తగా ఉడికించిన ఆలూని వెల్లులిని తురుముకోవాలి.
  2. తురుముకున్న ఆలూలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి ముందు నీరు వేయకుండా పిండి గట్టిగా ఆకుని పిండుతూ కలుపుకుంటే తరువాత ఎంత నీరు అవసరం అవుతుందో తెలుస్తుంది.
  3. మెత్తగా కలుపుకున్న పిండిలో కొద్దిగా నూనె వేసి మరో నిమిషం కలిపి తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి.
  4. నానిన పిండిని నాలు పెద్దవి లేదా చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  5. కాస్త నూనె రాసి పిండిని పలుచగా వత్తుకుని పైన కాస్త నూనె పూసి త్రిభుజాకారంలో మడత వేసి మళ్ళీ త్రిభుజాకారంలోకి పరోటా వత్తుకోవాలి.
  6. వత్తుకున్న పరోటా వేడి పెనం మీద వేసి ముందు రెండు వైపులా కాలనిచ్చి కరువాత నూనె వేసుకుంటూ ఎర్రగా కాల్చి తీసుకోవాలి.
  7. ఈ ఆలూ మేథీ పరోటా కమ్మని పెరుగు పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.