నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి కాస్త వేపి ఆ తరువాత ఆవాలు వేసి చిటచిటలాడించి జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు వేసి వేపుకోవాలి.
ఆ తరువాత తోటకూర తరుగు, పసుపు, పచ్చిమిర్చి , అల్లం వెల్లూలి ముద్ద వేసి 3-4 నిమిషాల పాటు పసరు వాసన పోయే దాకా ఫ్రై చేసుకోవాలి.
4 నిమిషాలకి పసరు వాసన పోతుంది, అప్పుడు కాసిని నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేం మీద పొడిగా పొడిగా అయ్యేదాకా పూర్తిగా మగ్గనిచ్చి దిమ్పెసుకోండి.
పెరుగుని బాగా చిలికి నీళ్ళు, ఉప్పు పోసి కలిపి, చల్లార్చుకున్న తోటకూర వేసి కలుపుకోండి.