శెనగపప్పు మినపప్పు రెంటినీ కడిగి నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలి.
నానిన పప్పుని వడకట్టి మిక్సీలో వేసి 3-4 tbsp నీళ్ళు పోసి బరకగా గట్టిగా రుబ్బుకోవాలి.
గట్టి శెనగపప్పు ముద్దలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి తోటకూరని గట్టిగా పిండుతూ కలుపుకోవాలి.
కలుపుకున్న పిండి ముద్దని అరిటాకు పై 3-4 బొట్లు నూనె వేసి దాని మీద పెద్ద నిమ్మకాయ సైజు పిండి ముద్దని పలుచగా వత్తుకుని మధ్యలో రంధ్రం చేసి వేడి వేడి నూనెలో వేసి ఎర్రగా కరకరలాడేట్టు వేపుకోవాలి.
వడలు వేసేప్పుడు మంట తగ్గించి వేశాక మీడియం- హై ఫ్లేమ్ మీద ఎర్రగా కరకరలాడేట్టు వేపుకోవాలి.