ఉసిరికాయ పప్పు | ఉసిరికాయ పప్పు రెసిపి

Veg Curries | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 30 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • ఉసిరికాయ ముద్ద కోసం:
  • 6 ఉసిరికాయలు
  • 1 ½ cups నీరు
  • 5 - 7 పచ్చిమిర్చి
  • పప్పు ఉడికించుకోడానికి:
  • ½ cup కందిపప్పు
  • 2 పచ్చిమిర్చి
  • ¼ tsp పసుపు
  • 1½ cups నీళ్లు
  • పప్పు కోసం:
  • ½ cup నూనె
  • ¼ tsp మెంతులు
  • 1 tbsp ఆవాలు
  • 2 ఎండుమిర్చి
  • 1 tbsp పచ్చిశెనగపప్పు
  • 2 pinches ఇంగువ
  • ½ tsp జీలకర్ర
  • 10-12 cloves దంచిన వెల్లులి
  • 3 sprigs కరివేపాకు
  • ½ cup ఉల్లిపాయ సన్నని తరుగు
  • 2 పెద్ద టమాటో తరుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు

విధానం

  1. కందిపప్పు ని కడిగి నానబెట్టుకోండి.
  2. ఉసిరికాయలని నీరు పోసి ఉడికించుకోండి. ఉడికిన ఉసిరిని తీసి చల్లార్చండి. మిగిన నీరు పక్కనుంచండి.
  3. నానిన పప్పులో పసుపు పచ్చిమిర్చి నీరు వేసి మెత్తగా ఉడికించుకోండి.
  4. ఉడికిన ఉసిరికాయలలోని గింజలు తీసేసి ముక్కలుగా కోసుకోండి అందులో పచ్చిమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి.
  5. నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి రంగు మారనివ్వండి, ఆ తరువాత ఆవాలు ఎండుమిర్చి సెనగపప్పుతో మిగిలిన తాలింపు సామాగ్రీ అంతా వేసేసి తాలింపు వేపుకోండి.
  6. వేగిన తాలింపులో ఉల్లిపాయ సన్నని తరుగు వేసి మెత్తబడే వరకు వేపుకోండి.
  7. మెత్తబడిన ఉల్లిపాయలో, టమాటో తరుగు, ఉప్పు, పసుపు వేసి గుజ్జుగా అయ్యేదాకా మగ్గించుకోండి.
  8. గుజ్జుగా ఉడికిన టమాటోలో, మెత్తగా ఉడికించుకున్న పప్పు వేసి కలిపి 5-6 నిమిషాలు ఉడికించుకోండి.
  9. ఆ తరువాత బరకగా రుబ్బుకున్న ఉసిరి పేస్ట్, ఉసిరిని ఉడికించుకున్న నీరు అవసరం మేరకు పోసి కలిపి మూతపెట్టి ఇంకో 3-4 నిమిషాలు ఉడికిస్తే ఉసిరిలోని సారమంతా పప్పులోకి దిగుతుంది.
  10. దింపబోయే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి.