ఆంధ్రా కరివేపాకు పచ్చడి

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 30 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 60 Mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 50 gms కరివేపాకు
  • 90 - 100 gms చింతపండు గుజ్జు
  • 100 gm పచ్చిమిర్చి
  • 2 tbsp ఉప్పు
  • 1/4 cup నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/4 tsp మెంతులు
  • 1 tsp జీలకర్ర
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp సెనగపప్పు
  • 2 tsp ధనియాలు
  • 10 వెల్లులి
  • 1/2 tsp పసుపు

విధానం

  1. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రబడే దాకా వేపుకోవాలి.
  2. వేగిన మెంతుల్లో సెనగపప్పు మినపప్పు వేసి రంగు మారే దాటాక వేపుకోవాలి, ఆ తరువాత మెంతులు వేసి వేపుకోవాలి
  3. వేగిన తాలింపులో వెల్లులి జీలకర్ర పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిని నిదానంగా పూర్తిగా మగ్గనివ్వాలి నూనెలో.
  4. పమగ్గిన పచ్చిమిర్చిలో కడిగి నీడన ఆరబెట్టినా కరివేపాకు వేసి ఆకులో చెమ్మారి కారకరలాడేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి
  5. వేగిన తాలింపుని మీకేసీ జార్లోకి తీసి నీరు వేయకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి
  6. కరివేపాకు వేపిన మూకుడులోనే చిక్కని చింతపండు గుజ్జు బెల్లం వేసి తేనేలాంటి చిక్కని పేస్ట్ అయ్యేదాకా ఉడికించాలి (బెల్లం చింతపండులోని గుజ్జుతో కరిగిపోతుంది)
  7. చిక్కని చింతపండు పేస్టులో ఉప్పు పసుపు గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడి వేసి స్టవ్ ఆపేసి బాగా కలిపి పూర్తిగా చల్లారానివ్వాలి.
  8. చల్లారిన పచ్చడిని గాజు సీసాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే నెల రోజుల పైన బైట అయితే 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది.