కాకరకాయ పొడి

Bachelors Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 18 Mins
  • Resting Time 30 Mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms కాకరకాయ
  • 2 tbsp పచ్చిశెనగపప్పు
  • 2 tbsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 2 tbsp ధనియాలు
  • 7 - 8 వెల్లులి - రెబ్బలు
  • చింతపండు - ఉసిరికాయంత
  • 10 - 15 ఎండుమిర్చి
  • 1 tbsp బెల్లం
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1/3 cup నూనె

విధానం

  1. కాకరకాయని పెద్ద రంధ్రాల వైపు తురుముకోవాలి. తరువాత ఉప్పేసి కలిపి ముప్పై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
  2. ఒక స్పూన్ నూనె వేసి మినప సెనగ ధనియాలు జీలకర్ర ఒక్కోటిగా వేసుకుంటూ మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి.
  3. పప్పులు వేగాక వెల్లులి, చింతపండు కూడా వేసి వేపి దింపి చల్లార్చుకోండి.
  4. ఇంకో స్పూన్ నూనె వేసి ఎండుమిర్చిని ఎర్రగా వేపుకోవాలి. వేగిన మిర్చిని చల్లార్చుకోవాలి.
  5. ఉప్పేసి కలిపి ఉంచుకున్న కాకరకాయ తురుముని గట్టిగా పిండి రసం తీసేయాలి.
  6. మిగిలిన నూనె వేసి పిండిన కాకరకాయ ముద్ద వేసి మాంచి బంగారు రంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి. బంగారు రంగు వచ్చాక దింపి పూర్తిగా చల్లార్చాలి.
  7. మిక్సీలో వేపుకున్న పప్పుల్ని మిర్చీని చింతపండు ఉప్పు బెల్లం వేసి మెత్తని పొడి చేసుకోండి.
  8. తరువాత వేపుకున్న కాకరకాయ పొడి వేసి పల్స్ చేసి తీసుకోండి.
  9. పొడిని గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే నెలకి పైగా నిల్వ ఉంటుంది. వేడిగా నెయ్యి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.