మామిడికాయ ఎండు నెత్తళ్లు కర్రీ | మామిడికాయ ఎండు చేపల కూర
|
nonvegetarian
Prep Time10 Mins
Cook Time20 Mins
Servings4
కావాల్సిన పదార్ధాలు
70
grams ఎండు నెత్తళ్లు
8-10
tbsp నూనె
½
tsp ఆవాలు
½
tsp జీలకర్ర
1
ఎండు మిర్చి
1
sprig కరివేపాకు
8-10
cloves దంచిన వెల్లులి
½
cup ఉల్లిపాయ తరుగు
2
slits పచ్చిమిర్చి చీలికలు
ఉప్పు - రుచికి సరిపడా
1½
tbsp కారం
¼
tsp పసుపు
1
tsp ధనియాల పొడి
½
tsp జీలకర్ర పొడి
1
cup టమాటో తరుగు
1¼
cups నీరు
2
tbsp ఎండు కొబ్బరి పొడి
కొత్తిమీర తరుగు - కొద్దిగా
⅓
cup చెక్కు తీసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు
విధానం
చేపల తలలని తోకలని తుంచుకోండి, తరువాత పెనం మీద వేసి సన్నని సెగ మీద చేపని వెచ్చబడే దాకా వేపుకోండి.
వేగిన చేపలని మరిగే వేడి నీటిలో వేసి కేవలం 10 సెకన్లు ఉడికించి వడకట్టేసి చల్లని నీళ్లలో వేసి నెమ్మదిగా చేప చిదిరిపోకుండా కడుక్కుని తీసుకుంటే చేప శుభ్రపడినట్లె!!!
నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లులి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోండి.
వేగిన తాలింపులో ఉల్లి పాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిని లేత గులాబీ రంగు వచ్చేదాకా వేపుకోండి.
ఉల్లి మెత్తబడ్డాక టమాటో ముక్కలు ఉప్పు వేసి టమాటోలు గుజ్జుగా అయ్యాయేదాకా మగ్గించుకోండి. ఆ తరువాత పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి వేపుకోండి.
కారాలు వేగిన తరువాత శుభ్రం చేసుకున్న ఎండు చేపలు వేసి నెమ్మదిగా కలిపి 2-3 నిమిషాలు వెస్పుకోండి. ఆ ఆతరువాత నీరు పోసి నూనెపైకి తేలేదాకా మగ్గనివ్వండి.
1¼ కప్పుల నీళ్లు పోసి, కూరలో నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
చేపల్లోంచి నూనె పైకి తేలిన తరువాత మామిడికాయ ముక్కలు వేసి ముక్కలని మెత్తబడనివ్వండి.
ఆఖరుగా కొబ్బరి పొడి కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.