మూకుడులో ¼ కప్పు నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లులి ముద్ద, పసుపు మాంసం, నీళ్లు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మాంసం మెత్తగా ఉడికేదాకా మాధ్యమధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. (అవసరమైతే కాసిని నీళ్లు పోసుకోండి, ఇంకా కుక్కర్లో వండే తీరు కోసం టిప్స్ చుడండి).
మాంసం ఉడికే లోపు మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపుకోవాలి. ఆఖరున పొట్టు తీసిన వెల్లులి వేసి కలిపి మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోండి.
సుమారుగా గంట తరువాత మాంసం మెత్తగా ఉడికి ఇంకా ఇలా కాస్త గ్రేవీతో ఉంటుంది అప్పుడు మిగిలిన నూనె కడిగిన ఎర్ర గోంగూర వేసి ఆకు మెత్తబడే దాకా కలుపుకోవాలి.
ఆకు మెత్తుగా అయ్యాక వెల్లులి తరుగు మాంసం మసాలా కారం పొడి వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక ఉడకనివ్వాలి.
నూనె పైకి తేలాక దింపేసుకుని వేడి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకోండి.