పప్పు చారు | అమ్మలకాలం నాటి పప్పు చారు | మీకు పర్ఫెక్ట్ పప్పుచారు గారంటీ
Curries
|
vegetarian
Prep Time5 Mins
Cook Time20 Mins
Resting Time30 Mins
Servings6
కావాల్సిన పదార్ధాలు
1/2
cup కందిపప్పు
2
cup నీళ్ళు
1/2
tsp పసుపు
పప్పుచారుకి
2
tbsp నూనె
1
tsp ఆవాలు
1
tsp జీలకర్ర
1
tsp సెనగపప్పు
ఇంగువా -చిటికెడు
2
ఎండుమిర్చి
3
పచ్చిమిర్చి
1
cup ఉల్లిపాయ చీలికలు
1
రెబ్బ కరివేపాకు
6 - 7
పీచు తీసిన మునక్కాడ ముక్కలు
2
టమాటో ముక్కలు
కొత్తిమీర- పిడికెడు
300
ml నీళ్ళు
1
tbsp బెల్లం పొడి
ఉప్పు
1
tsp కారం
1
tsp ధనియాల పొడి
100
ml 50 గ్రాముల నుండి తీసిన చింతపండు పులుసు
విధానం
2 గంటలు కడిగి నానబెట్టిన కందిపప్పుని కుక్కర్ లో వేసి 2 కప్స్ నీళ్ళు, పసుపు వేసి మీడియం ఫ్లేం మీద 3 విసిల్స్ రానివ్వండి
ఆవిరి పోయాక పప్పు మిక్సీలో వేసి మెత్తని పేస్టు చేసుకోండి
రాచ్చిప్పలో/అడుగుమందంగా ఉన్న పాత్రలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, సెనగపప్పు వేసి వేపుకోవాలి
ఉల్లిపాయ, మునక్కాడ, పచ్చిమిర్చి చీలికలు వేసి మూతపెట్టి ఉల్లిపాయలు, మునక్కాడ ముక్కలు మెత్తబడేదాక మీడియం ఫ్లేం మీద మూత పెట్టి మగ్గనివ్వండి.
ముక్కలు మగ్గాక టమాటో ముక్కలు ఉప్పు, కారం, ధనియాల పొడి చేర్చి టమాటో ముక్కలు కూడా మెత్తబడనివ్వాలి మూతపెట్టి.
ఆ తరువాత 100ml చింతపండు పులుసు పోసి మరో 3 నిమిషాలు మరగనివ్వండి.
పులుసు మరిగాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పు, 300 ml నీళ్ళు పోసి బాగా కలిపి సన్నని సెగ మీద 10-12 నిమిషాలు మరగనివ్వండి.
పప్పుచారు మరుగుతున్నప్పుడు కొత్తిమీర తరుగు, బెల్లం తరుగు మరో 5 నిమిషాలు ఉడికించి దిమ్పెసుకోండి.
• ఈ పప్పు చారు అప్పడాలు, వడియాలు, ఆమ్లెట్, చికెన్ ఫ్రై తో చాలా రుచిగా ఉంటుంది