ఆంధ్రా స్టైల్ రొయ్యల మసాలా

| nonvegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 20 Mins
  • Resting Time 30 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms కడిగి శుభ్రం చేసిన రొయ్యలు
  • ఉప్పు - కొద్దిగా
  • 1/4 tsp పసుపు
  • ఉల్లిపాయ పేస్ట్ కోసం
  • 2 ఉల్లిపాయ ముక్కలు
  • 4 పచ్చిమిర్చి
  • అల్లం - అంగుళం
  • 8 వెల్లులి
  • మసాలా కూర కోసం
  • 1/4 cup నూనె
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1/2 tsp గరం మసాలా
  • కొత్తిమీర - చిన్నకట్ట

విధానం

  1. రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి కనీసం అరా గంట పక్కనుంచుకోండి.
  2. మిక్సీ జార్లో ఉల్లిపాయ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. నూనె వేసి చేసి అందులో నానబెట్టిన రొయ్యలు వేసి 50% వేపుకుని తీసుకోండి (50% వేపడం ఎలాగో టిప్స్ చుడండి).
  4. మిగిలిన నూనెలో ఇంకొంచెం నూనె వేసి కరివేపాకు వేసి వేపి ఉల్లిపాయ గుజ్జు వేసి నూనె పైకి తేలేదాక కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిపాయ పేస్టులో కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు వేసి వేపి వెంటనే నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
  6. మరుగుతున్న ఎసరులో సగం పైన వేపుకున్న రొయ్యలు వేసి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడనివ్వాలి.
  7. కూర ముద్దగా దగ్గర పడ్డాక గరం మాసాలా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోండి.