ఆంధ్రా స్టైల్ టొమాటో కాజు మసాలా కర్రీ

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 3 tbsp నూనె
  • 1/2 tsp జీలకర్ర
  • 2 ఉల్లిపాయ తరుగు
  • 2 రెబ్బల కరివేపాకు
  • 2 ఎండుమిర్చి
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/2 cup జీడిపప్పు
  • 3 టొమాటోల పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • 1/4 tsp గరం మసాలా
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1 tsp కారం
  • 2 టొమాటోల పెద్ద ముక్కలు
  • 2 tbsp జీడిపప్పు పేస్ట్
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • 1 tsp నెయ్యి
  • 250 ml నీళ్ళు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి చిటచిటలాడించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేదాక లేత వేపుకోవాలి.
  2. ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చాక జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. జీడిపప్పు వేగిన తరువాత అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోవాలి.
  4. తరువాత గరం మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి,
  5. మసాలాలూ వేగిన తరువాత టొమాటో పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  6. టొమాటోలు వేగిన తరువాత టొమాటో పెద్ద తరుగు ముక్కలు వేసి టొమాటో మెత్తబడే దాకా నూనెలో మగ్గించాలి.
  7. టొమాటోల పైన తోలు ఊడేదాకా వేగిన తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి వేపుకోవాలి (జీడిపప్పు పేస్ట్కి బదులు ఏమి వాడుకోవచ్చో టిప్స్ చూడండి).
  8. నీళ్ళు పోసి బాగా కలిపి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. దింపే ముందు నెయ్యి కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.