అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం

Prasadam | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 45 Mins
  • Total Time 55 Mins
  • Servings 15

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup ఎర్ర గోధుమ రవ్వ
  • 1 cup పంచదార
  • 1 cup బెల్లం తురుము
  • 1/3 cup నెయ్యి
  • సెనగబద్దంత జాజికాయ ముక్క
  • 1/4 tsp పటిక
  • 4-5 యాలకలు
  • 2 చిటికెళ్ళ కుంకుమపువ్వు
  • 3 నీళ్ళు

విధానం

  1. జాజికాయ, పటిక, యాలకలు, కుంకుమపువ్వు వేసి బాగా దంచి పక్కనుంచుకోండి.
  2. అడుగు మందంగా ఉన్న మూకుడులో గోధుమ నూక వేసి సన్నని సెగ మీద కలుపుతూ నూక తెల్లగా అయ్యేదాకా వేపుకుని పక్కనుంచుకోవాలి.
  3. అదే మూకుడు లో 3 కప్పుల నీరు పోసి హై-ఫ్లేం మీద ఎసరుని తెర్ల కాగనివ్వాలి.
  4. ఎసరు మరుగుతుండగా వేపుకున్న రవ్వ వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేం మీద రవ్వని మెత్తగా ఉడకనివ్వాలి
  5. ఉడికిన రవ్వలో పంచదార పోసి కరిగించి మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాలు ఉడికిస్తే మంచి రంగులోకి వస్తుంది, అప్పుడు బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి.
  6. బెల్లం పూర్తిగా కరిగి పాకం పైకి తేలి ప్రసాదం కుతకుతలాడుతూ ఉడుకుతుంది, అప్పుడు నెయ్యి పోసి కదపకుండా మూతపెట్టి 5-6 నిమిషాలు వదిలేయాలి.
  7. 5-6 నిమిషాలకి నెయ్యిలో మరిగి మాంచి బంగారులోకి వస్తుంది ప్రసాదం, అప్పుడు దంచుకున్న సుగంధద్రవ్యలన్నీ వేసి బాగా కలిపి చిక్కబడేదాక ఉంచి దిమ్పెసుకోండి.
  8. వేడి మీదే విస్తరాకులో చుట్టి ఉంచితే ఆకు పరిమళం ప్రసాదానికి పట్టి అన్నవరం ప్రసాదం రుచి వస్తుంది.