Close Window
Print
Recipe Picture
అప్పాలు / సజ్జ అప్పలు | చాలా త్వరగా కరకరలాడే అప్పాలు | రవ్వ అప్పాలు
Sweets | vegetarian
Prep Time
1 Mins
Cook Time
25 Mins
Resting Time
15 Mins
Servings
15
1x
2x
3x
కావాల్సిన పదార్ధాలు
1 cup
బొంబాయ్ రవ్వ
1 cup
పంచదార
1/2 tsp
యాలకల పొడి
1 cup
నీళ్ళు
నూనె వేపుకోడానికి
విధానం
Hide Pictures
రవ్వలో పంచదార యాలకలపొడి వేసి కలిపి పక్కనుంచుకోండి.
గిన్నెలో కప్పు నీళ్ళు పోసి తెర్ల కాగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో రవ్వ పోస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి లేదంటే గడ్డలు కట్టేస్తుంది.
రవ్వ బాగా కలిశాక మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి దింపి పూర్తిగా చల్లారచాలి.
చల్లారిన రవ్వ ముద్దని చేతికి నూనె రాసుకుని చిట్టి గారెలా మాదిరి వత్తుకోవాలి.
వత్తుకున్న అప్పాలని వేడి నూనెలో వేసి మీడియం – హై ఫ్లేమ్ మీద ఎర్రగా బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
వేగిన అప్పాలని గరిటతో నొక్కితే పీల్చిన నూనె అప్పాలు వదులుతాయ్.
వత్తుకున్న అప్పాలని గాలికి ఆరానిచ్చి ఆరగించండి. (వేడి మీద అప్పాలు లోపల ముద్దగా ఉంటాయ్ , చల్లారాక బిరుసుగా అవుతాయ్)