250
gms ఉడికించిన చేమగడ్డ (పొత్తు తీసి అంగుళం ముక్కలుగా కోసుకున్నవి)
3
tbsp నూనె
1
cup ఉల్లిపాయ తరుగు
1/2
cup టమాటో ముక్కలు
4
పచ్చిమిర్చి చీలికలు
1
tsp ఆవాలు
1/4
tsp మెంతులు
1/2
tsp జీలకర్ర
1
tsp పచ్చిశెనగపప్పు
1
tsp మినపప్పు
3
ఎండుమిర్చి
10
దంచిన వెల్లులి
2
రెబ్బలు కరివేపాకు
ఉప్పు
1/4
tsp పసుపు
1.5
tsp కారం
1
tsp ధనియాల పొడి
1/2
tsp మిరియాల పొడి
కొత్తిమీర - కొద్దిగా
150
ml చింతపండు పులుసు (నిమ్మకాయ సైజు అంత చింతపండు నుండి తీసినది)
600
ml నీళ్లు
విధానం
నూనె వేడి చేసి అందులో ఆవాలు సెనగపప్పు మినపప్పు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వెల్లులి వేసి మెంతులు ఎర్రబడి దాకా వేపుకోవాలి.
వేగిన తాలింపులో కరివేపాకు రెబ్బలు పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి.
ఉల్లిపాయల చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
వేగిన ఉల్లిపాయల్లో టమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి టమాటో మెత్తబడే దాకా వేపుకోవాలి.
మగ్గిన టొమాటోల్లో కారం ధనియాల పొడి మిరియాల పొడి వేసి మాడకుండా వేఫై చింతపండు పులుసు పోసి కలిపి నూనె పైకి తేలేదాక నెమ్మదిగా మరగనివ్వాలి.
నూనె పైకి తేలాక నీళ్లు పోసి ఉడికించిన చేమగడ్డలు వేసి కలిపి మూత పెట్టి 30-40 నిమిషాల పాటు నిదానంగా ఉడికిస్తే అప్పుడు దుంపకి ఉప్పు కారం పులుసు పట్టి ఎంతో రుచిగా ఉంటుంది పులుసు.