తరువాత బియ్యం ఉప్పు వేసి రెండు నిమిషాలు వేపి వేడి నీరు పోసుకోండి, తరువాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద రెండే విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి ఆవిరి పోయేదాక వదిలేయండి. తరువాత సర్వ్ చేసుకోండి.
చికెన్కి ఉప్పు పసుపు అల్లం వెల్లులి పేస్ట్ నిమ్మరసం వేసి బాగా పట్టించి కనీసం గంట సేపు ఊరనివ్వండి
మసాలా దినుసుల కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నాని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. మసాలా దినుసులు మాంచి సువాసన వస్తున్నప్పుడు ఎండు కొబ్బరి పొడి గసగసాలు వేసి చిట్లనిచ్చి దింపెయండి. చల్లారాక మెత్తని పొడి లేదా పేస్ట్ చేసుకోండి
నూనె వేడి చేసి కరివేపాకు ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి.
ఉల్లిపాయ మెత్తబడిన తరువాత కొద్దిగా అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి. తరువాత ఊరబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
నూనె పైకి తేలిన తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గిపోయే దాకా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గనివ్వాలి.
టొమాటోలు పూర్తిగా మగ్గిపోయిన తరువాత గరం మసాలా పొడి వేసి ముందు నీరు వేయకుండా 3-4 నిమిషాలు వేపుకోండి.
3-4 నిమిషాలు మసాలాలో చికెన్ వేగితే నూనె పైకి తేలుతుంది అప్పుడు వేడి నీరు పోసి కలిపి మూత ఆపెట్టి 17 నిమిషాలు వదిలేస్తే చికెన్ పూర్తిగా ఉడికిపోయి నూనె పైకి తేలుతుంది
నూనె పైకి తేలిన తరువాత కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవడమే!!!
చికెన్ కర్రీతో బాగారన్నం ఒక అద్భుతమైన కాంబినేషన్ తప్పాక అందరికి నచ్చుతుంది. ట్రై చేయండి.