అరటిదూట బూందీ పెరుగు పచ్చడి | అరటిదూట బూందీ పెరుగు పచ్చడి రెసిపీ

Summer Recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 20 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms అరటిదూట
  • ½ litre పెరుగు
  • 1 cup బూందీ
  • ¼ tsp పసుపు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1 sprig కరివేపాకు (ఒక రెబ్బ)
  • కొత్తిమీర (కొద్దిగా)
  • 1 cup నీళ్లు
  • ఆవాల ముద్ద కోసం:
  • ½ tsp ఆవాలు
  • 1 tsp పచ్చిశెనగపప్పు
  • 1 tsp కందిపప్పు
  • ¾ tsp మిరియాలు
  • 1 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 పచ్చిమిర్చి
  • 2 ఎండుమిర్చి
  • 1 tsp బియ్యం
  • ⅓ cup పచ్చి కొబ్బరి
  • అల్లం (చిన్న ముక్క)
  • తాలింపు కోసం:
  • 2 tbsp నెయ్యి
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 2 pinches ఇంగువ
  • 1 sprig కరివేపాకు (ఒక రెబ్బ)

విధానం

  1. ఆవాల ముద్ద కోసం ఉంచిన పదార్ధాలు అన్నింటిలో నీరుపోసి ఒక గంట నానబెట్టండి.
  2. నానిన దినుసులన్నీ మిక్సర్ జార్లో వేసి పచ్చికొబ్బరి అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. రెండు చెంచాల బియ్యం పిండిలో నీరు పోసి కలిపి పక్కనుంచండి.
  4. చేతులకి నూనె రాసుకుని అరటిదూటని సన్నని చక్రాల మాదిరి కోసి దూటలో వచ్చే పీచుని మెలితిప్పి లాగేయండి. ముక్కలని బియ్యం పిండి నీళ్లలో వేసేయండి.
  5. అరటిదూట చక్రాలని ఒక దానిమీద ఒకటి పేర్చి సన్నని ముక్కలుగా కోసుకోండి. కోసుకున్న ముక్కలని బియ్యం పిండి నీళ్లలోనే వేసేయండి.
  6. కుక్కర్లో లేదా విడిగా అరటిదూట ముక్కలని వేసి అందులో నీరూ, కొంచెం పసుపు ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోండి.
  7. ఉడికిన ముక్కలని వడకట్టి పూర్తిగా చల్లారనివ్వండి.
  8. పెరుగుని బాగా చిలకండి. చిలికిన పెరుగులో ఆవాల ముద్దా, ఉప్పు పసుపు నీరు కరివేపాకు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద రెండు పొంగులు రానివ్వండి.
  9. పొంగుతున్న పెరుగు మిశ్రమంలో మెత్తగా ఉడికించి చల్లార్చుకున్న అరటిదూట ముక్కలు వేసి 4-5 నిమిషాలు ఉడికించండి.
  10. 4-5 నిమిషాలు ఉడికించిన తరువాత బూందీ వేసి కలిపి ఒకే నిమిషం ఉడికించి దింపేసుకోండి.
  11. నెయ్యి వేడి చేసి అందులో మెంతులు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర ఇంగువ కరివేపాకు ఒకటి వేపుకున్నాక మరొకటి వేసి గుభాళించేట్టు తాలింపు వేపుకోండి.
  12. వేగిన తాలింపుని పెరుగు పచ్చడిలో కలిపేసుకోండి.
  13. ఈ పెరుగు పచ్చడి శరీరానికి ఎంతో చలువ చేస్తుంది ఇంకా చాలా రుచిగా ఉంటుంది.