కుక్కర్లో నూనె వేడి చేసి అందులో బిరియానీ ఆకు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేపుకోవాలి.
ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత టొమాటో అల్లం వెల్లులి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోండి.
టొమాటో మెత్తబడ్డాక ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
తరువాత నానబెట్టిన పచ్చిశెనగపప్పు వేసి 2 నిమిషాలు వేపుకుని నీళ్ళు పోసి ఒక విసిల్ హై ఫ్లేమ్ మీద, 2 విసిల్స్ లో ఫ్లేమ్ మీద రానిచ్చి స్టెమ్ పోయే దాకా వదిలేయండి.
గుడ్లులో ఆమ్లెట్కి కావాల్సిన పదార్ధాలన్నీ వేసి బాగా ఎక్కువ సేపు బీట్ చేసుకోండి. పాన్లో నూనె వేసి కాస్త మందంగా ఆమ్లెట్ వేసి 90% కాల్చుకోవాలి (పర్ఫెక్ట్ ఆమ్లెట్ కోసం టిప్స్ చూడండి)
ఆమ్లెట్ ని ముక్కలుగా కట్ చేసుకోండి
స్టీమ్ పోయిన శెనగపప్పుని హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మరుగుతున్న పప్పులో టొమాటో ముక్కలు, గరం మసాలా కొత్తిమీర తరుగు ఆమ్లెట్ వేసి 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.