మైదా పిండిలో నూనె ఉప్పు నీళ్ళు వేసి మెత్తని పిండిగా వత్తి 30 నిమిషాలు నానబెట్టుకోండి.
మినపప్పుని నీళ్ళతో చిక్కగా మృదువుగా రుబ్బుకోండి.
మిక్సీలో అల్లం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోండి.
పాన్లో నూనె వేడి చేసి అందులో ఉల్లి గింజలు, సొంపు వేసి వేపుకోవాలి, తరువాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
తరువాత ఇంగువ, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేపి రుబ్బుకున్న మినపపిండి వేసి గట్టిగా ముద్దగా అయి పాన్ నుండి విడిపోయేదాక కలుపుతూ వేపుకోవాలి. వేగిన ముద్దని పూర్తిగా చల్లారచాలి
మైదా పిండి ముద్దని అరచేతిలో పెట్టి వత్తి ఉసిరికాయ అంత పిండి ముద్దని లోపల పెట్టి మైదా పిండి ముద్దతో సీల్ చేసుకోవాలి. తరువాత కాస్త వత్తితే లోపలి స్టఫ్ఫింగ్ సమాంతరంగా స్ప్రెడ్ అవుతుంది.
పొడి పిండి చల్లి పూరిలా మాదిరి వత్తి, పై పొడి పిండి దులిపి వేడి వేడి నూనె లో వేసి రాధాభల్లభి మీదికి నూనెని ఎగదోస్తుంటే పొంగుతుంది. పొంగానే తీసేయండి. రాధాభల్లభి తెల్లగా వేగాలి అప్పుడే మృదువుగా ఉంటాయ్.