కుక్కర్లో చెక్కు తీసిన ఆలూ పసుపు ఉప్పు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక కూత వచ్చే దాకా హై-ఫ్లేమ్ మీద కుక్ చేసి స్టీమ్ పోయాక తీసి పూర్తిగా చల్లారచాలి.
చల్లారిన ఆలూని నూన్ వేసి ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
రోట్లో అల్లం వెల్లులి పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కనుంచుకోండి.
మూకుడులో ఆవా నూనె పోసి పొగలు వచ్చే దాకా వేడి చేసుకోవాలి, పొగలు వచ్చాక ఎండుమిర్చి జీలకర్ర బిరియానీ ఆకు, దాల్చిన చెక్క, వేసి జీలకర్ర చిటచిట అనే దాకా వేపుకోవాలి.
వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తరువాత దంచుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
నూనె పైకి తేలాక పసుపు, ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు వేసి వేపుకోవాలి.
మసాలాలు వేగిన తరువాత చిలికిన పెరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి.
పెరుగు కూరలో కలిసి నూనె పైకి తేలాక వేపుకున్న ఆలూ వేసి నెమ్మదిగా కలుపుకోండి ఆ తరువాత నీళ్ళు పోసి కలిపి సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక మూత పెట్టి ఉడికించుకోవాలి.
నూనె పైకి తేలాక కొత్తిమీర తరుగు, గరం మసాలా చల్లి దింపేసుకుని వేడిగా లూచి, పూరీ చపాతీతో ఎంజాయ్ చేయండి.