పెళ్ళిళ్ళ స్పెషల్ బెండకాయ 65 | మా టిప్స్ తో బెండకాయ ఫ్రై చేసి చుడండి మర్చిపోలేరు

Curries | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 15 Mins
  • Total Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 500 gms బెండకాయలు
  • 2 కరివేపాకు
  • 1/4 cup వేరు సెనగపప్పు
  • 1/4 cup బియ్యం పిండి
  • 1/4 cup సెనగపిండి
  • 1/2 tsp గరం మసాలా
  • 2 tbsps పచ్చి కొబ్బరి
  • సాల్ట్
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp కారం
  • 6 వెల్లులి
  • 1 ఇంచ్ అల్లం
  • 5 పచ్చిమిర్చి
  • నూనె- వేయించడానికి

విధానం

  1. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లూలి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  2. ఇప్పుడు లేత బెండకాయ ముక్కల్లో బియ్యం పిండి, సెనగపిండి, ఉప్ప, కారం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసి ముందు ముక్కలకి బాగా పట్టించండి.
  3. తరువాత 2 tbsps నీళ్ళు పోసి బెండకాయలకి బాగా పట్టించండి, పిండి బాగా గట్టిగా ఉండాలి.
  4. నూనె వేడి చేసి అందులో పల్లీలు వేపుకుని పక్కనుంచుకోండి, తరువాత కరివేపాకు వేపి పక్కనుంచుకోండి.
  5. బెండకాయ ముక్కలని వేసి కేవలం మీడియం ఫ్లేం మీద మాత్రమే ఎర్రగా వేపుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ రాగానే హై ఫ్లేం మీద వేపుకోండి క్రిస్పీ గా వేగుతాయ్.
  6. ఆఖరున వేపుకున్న బెండకాయ ముక్కల్లో వేడిగా ఉన్నప్పుడే గరం మసాలా, వేరు సెనగపప్పు, కరివేపాకు, పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకొండి.