కాకరకాయలని చెక్కుతీసి పావు అంగుళం మందాన ముక్కలు కోసుకోండి.
కోసుకున్న ముక్కల్లో ఉప్పు పసుపు వేసి బాగా పట్టించి అరగంట ఊరనిచ్చి ఆ తరువాత గట్టిగా పిండి పసరు తీసేయండి.
జీడిపప్పు కారం కోసం నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రంగా వేపి తీసుకోండి.
మిగిలిన నూనెలో మిగిలిన పదార్ధాలన్నీ ఒక దాని తరువాత ఆఖరుగా ఎండుకొబ్బరి వేసి ఎర్రగా వేగనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి.
మిర్చిని మెత్తగా గ్రైన్డ్ చేసుకున్నాకా జీడిపప్పులో కొన్ని ఉంచి మిగిలినవన్నీ ఇంకా చింతపండు ఉప్పు కారం వేసి ఆపి ఆపి బరకగా గ్రైండ్ చేసుకోండి.
వేపుడు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి వేపుకోండి.
వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు పసరు పిండేసిన కాకరకాయ ముక్కలు కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి. మూత మీద కప్పు నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద కాకరకాయ మెత్తగా మగ్గేదాకా వేపుకోండి.
సుమారుగా 20-25 నిమిషాలకి కాకరకాయ ముక్కలు మెత్తబడతాయ్ అప్పుడు గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు కారం వేపుకున్న జీడిపప్పు వేసి కలిసి ఒక్కటే నిమిషం వేపి దింపేసుకోండి. అంత కంటే వేగితే కారాలు మాడిపోతాయి.