కాకరయకాయ పులుసు | అమ్మల కాలం నాటి స్టైల్

Veg Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కాకరకాయ ముక్కలు ఉడికించడానికి
  • 250 gms కాకరకాయ ముక్కలు
  • 1/2 liter నీళ్ళు
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • పులసుకి
  • 3 tsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/4 tsp ఆవాలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి
  • 5 వెల్లులి
  • ఇంగువ – చిటికెడు
  • 1/4 cup చింతపండు గుజ్జు
  • 1/4 cup బెల్లం
  • ఉప్పు
  • 1.25 tsp కారం
  • 2 చిటికెళ్లు పసుపు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1/2 cup ఉల్లిపాయ సన్నని తరుగు
  • 1 cup నీళ్ళు
  • 2 tsp శెనగపిండి

విధానం

  1. చెక్కు తీసి ¼ ఇంచ్ ముక్కలుగా చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు నీళ్ళు పోసి ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
  2. ఉడికించుకున్న కాకరకాయ ముక్కలని వడకట్టి పక్కనుంచుకోండి.
  3. నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు జీలకర్ర వేసి మెంతులు ఎర్రగా బడే దాకా వేపుకోవాలి తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లులి, ఇంగువ వేసి వేపుకోవాలి.
  4. తాలింపు వేగాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడి నూనె పైకి తేలేదాక దాకా వేపుకోవాలి.
  5. ఉడికిన కాకరకాయ ముక్కలు వేసి 3-4 నిమిషాలు తాళింపులో వేగనివ్వాలి, వేగిన తరువాత నచ్చితే కాకరకాయ ఉడికించిన నీళ్ళు పోసుకోండి, చేదు తినలేరు అనుకుంటే మంచి నీళ్ళు 300ml, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు వేసి 15 నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనివ్వాలి.
  6. పులుసు చిక్కబడ్డాక శెనగపిండి లో ½ కప్పు నీళ్ళు పోసి గడ్డలు లేకుండా కలిపి పులుసులో పోసి బాగా కలిపి మరో 10 నిమిషాలు ఉడికిస్తే పులుసు చిక్కబడుతుంది అప్పుడు దింపేసుకోండి.