కాకరకాయ వేపుడు | కాకరకాయ ఫ్రై | చేదు లేని కాకరకాయ వేపుడు

Bachelors Recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 30 Mins
  • Resting Time 60 Mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • ½ kg చెక్కు తీసుకుని తరుక్కున ముక్కలు
  • 1 cup ఉల్లిపాయ కాస్త మందంగా ఉండే చీలికలు
  • 10 -12 cloves దంచిన వెల్లుల్లి
  • ½ tsp జీలకర్ర
  • ¼ cup బెల్లం
  • ⅓ cup నూనె
  • 1 ½ - 2 tbsp కారం
  • 2 sprigs కరివేపాకు
  • ¼ tsp పసుపు
  • ఉప్పు - రుచికి సరిపడా

విధానం

  1. చెక్కు తీసుకున్న కాకరకాయని కాస్త మీడియం సైజు ముక్కలుగా తరుక్కోండి.
  2. తరుక్కున్న ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపి గంటసేపు ఊరబెట్టండి. గంట తరువాత గట్టిగా పిండి పసరు తీసేయండి.
  3. నూనె వేడి చేసి అందులో జీలకర్ర వెల్లులి వేసి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ చీలికలు కరివేపాకు ఉప్పు వేసి కలిపి కనీసం 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి.
  4. 20 నిమిషాల తరువాత పసుపు బెల్లం తురుము వేసి ఇంకో 5-7 నిమిషాలు వేగనివ్వండి
  5. దింపబోయే ముందు కారం వేసి కలిపి దింపేసుకోండి. పూర్తిగా చల్లారిన తరువాత డబ్బాలో ఉంచుకుంటే వారం రోజులు నిలవుంటుంది.