మినపప్పు పచ్చడి | ఇడ్లి అట్టులోకి అన్నం లోకి ఈ పచ్చడి తింటే కొబ్బరి పచ్చడి పనికిరాదు

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup పొట్టు మినుములు
  • 8 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp మెంతులు
  • చింతపండు- నిమ్మకాయంత
  • 1 tbsp బెల్లం
  • 1 tsp ఆవాలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 2 tbsp నూనె

విధానం

  1. 1 tbsp నూనె వేడి చేసి అందులో మినుములు వేసి కేవలం లో-ఫ్లేం మీదే మాంచి సువాసనోచ్చేదాక వేపుకోవాలి. ఇది వేగి మాంచి సువాసన రావడానికి కాస్త టైం పడుతుంది.
  2. మంచి సువాసన రాగానే తీసి పక్కనుంచుకోండి.
  3. ఇప్పుడు మెంతులు వేసి ఎర్ర గా వేపుకోండి, వేగాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేపుకుని తీసుకోండి.
  4. ఇప్పుడు వేపుకున్న సామానంతా మిక్సీ జార్ లో వేసుకుని అందులోనే వెల్లూలి, బెల్లం ఉప్పు, చింతపండు వేసి వేడి నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి.
  5. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటమనిపించి కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేపి పచ్చడి లో కలిపేయండి.