సొరకాయ చపాతీ | దూది కంటే మెత్తని సొరకాయ చపాతీ

Healthy Recipes | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 1/2 cup గోధుమ పిండి
  • 2 cups సొరకాయ తురుము
  • ఉప్పు
  • 1/2 tsp గరం మసాలా
  • 1 tsp పచ్చిమిర్చి తరుగు
  • 1/2 tsp మిరియాల పొడి
  • ఇంగువ – చిటికెడు
  • నీళ్ళు తగినన్ని
  • 2 tbsp నూనె (పిండిలో కలపడానికి)
  • నూనె కాల్చుకోడానికి

విధానం

  1. పిండి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి గట్టిగా కలుపుకోవాలి.
  2. నీళ్ళు చిలకరించి పిండిని మృదువుగా వత్తుకోండి. ఆఖరున నూనె వేసి కలుపుకుని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి
  3. 15 నిమిషాల తరువాత పెద్ద నిమ్మకాయ సైజు పిండి ముద్దని పొడి పిండి చల్లి నెమ్మదిగా వత్తుకోవాలి
  4. వత్తుకున్న రొటీని వేడి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చి తరువాత tsp నూనె వేసి కాల్చుకుని తీసుకోండి.
  5. ఇవి చల్లని కమ్మని పెరుగుతో చాలా రుచిగా ఉంటాయ్.