సొరకాయ కొబ్బరి పాల కూర | సొరకాయ కూర చాలా కమ్మగా తిన్నతరువాత కూడా పొట్టకి ఎంతో హాయిగా ఉంటుంది

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kilo లేత సొరకాయ ముక్కలు (చెక్కు తీసినవి)
  • 1/2 cup పెరుగు
  • 200 ml నీళ్ళు
  • 300 ml చిక్కటి కొబ్బరి పాలు
  • 5 - 6 పచ్చిమిర్చి చీలికలు
  • 2 కరివేపాకు రెబ్బలు
  • సాల్ట్
  • తాలింపుకి
  • 1 tsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp మినపప్పు
  • 1/2 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి

విధానం

  1. పెరుగులో నీళ్ళు పోసి బాగా చిలిక్కుని అందులో సొరకాయ ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకోండి.
  2. పచ్చి మిర్చి చీలికలు, కరివేపాకు రెబ్బలు, సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేం మీద మజ్జిగ ఇగిరిపోయేదాక ఉడికించుకోండి.
  3. సొరకాయ ముక్కలు మగ్గాక కొబ్బరి పాలు పోసుకోండి. కొబ్బరి పాలు ఇంకా కొద్దిగా ఉండాగే దిమ్పెసుకోండి.
  4. నూనె వేడి చేసి అందులో తాలింపు సామానంత వేసి వేయించుకుని కూరలో కలిపేసుకోండి