సొరకాయ పచ్చడి

Pickles & Chutneys | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 18 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 3 cups సొరకాయ ముక్కలు
  • 2 టమాటో
  • 15 పచ్చిమిర్చి
  • కొత్తిమీర - చిన్న కట్ట
  • చింతపండు - చిన్న ఉసిరికాయంత
  • 2 tbsp నూనె
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • తాలింపు కోసం
  • 2 tbsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 1/2 tsp మినపప్పు
  • 1/2 tsp పచ్చిశెనగపప్పు
  • 2 ఇంగువ - చిటికెలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1 ఎండుమిరపకాయ ముక్కలు

విధానం

  1. పాన్లో నూనె వేడి చేసి అందులో సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి మూతపెట్టి సొరకాయ ముక్కలు మెత్తబడి దాకా మగ్గనిస్తే చాలు.
  2. మగ్గిన సొరకాయ ముక్కల్లో టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపి టమాటో పైన తోలు ఊడే దాకా మగ్గించాలి.
  3. మగ్గిన టొమాటోలో కొత్తిమీర చింతావులందు వేసి ఒకే నిమిషం కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలలతో మొదలెట్టి మిగిలిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి పచ్చడిలో కలిపేసుకోండి.