బోర్న్వీట కలాకండ్ చిక్కని పాలు పోసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ మరిగించాలి.
పాలు పొంగువచ్చాక పంచదార నిమ్మ ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద 20 నిమిషాలు కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది ఇంకా కాస్త నీరుగా ఉంటుంది అప్పుడు బోర్న్వీటా నెయ్యి వేసి 3 నిమిషాలు బాగా కలిపి దింపేసుకోవాలి.
వైట్ కలాకండ్ కోసం చిక్కని పాలు పంచదార వేసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ మరిగించాలి. పాలు బాగా దగ్గర పడ్డాక నెయ్యి వేసి కలిపి దింపేసుకోవాలి.
నెయ్యి రాసిన ప్లేట్లో ముందు వైట్ కలాకండ్ వేసి నున్నగా సమానంగా చేసుకోవాలి, ఆ పైన బోర్న్వీట కలాకండ్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.
ఈ ట్రేని కనీసం 6 గంటలు లేదా రాత్రంతా క్లాత్ కప్పి గాలికి వదిలేస్తే పర్ఫెక్ట్గా బిగుసుకుంటుంది.