వంకాయ మెంతి కూర ఫ్రై

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 15 Mins
  • Total Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kg లేత పొడవు వంకాయలు
  • 150 gms మెంతి కూర (3 కట్టలు)
  • 4 tbsps నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • ఇంగువ చిటికెడు
  • 1/4 tsp వాము
  • 1 tsp అల్లం తరుగు
  • 1 tbsp వెల్లూలి
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 2 టొమాటో
  • 2 పచ్చిమిర్చి తరుగు
  • 1/2 tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • ఉప్పు
  • 1 tbsp కారం

విధానం

  1. నూనె వేడి చేసి 2 అంగుళాల సైజు వంకాయ ముక్కలు వేసి రంగు మారి 80% మగ్గేదాకా వేపుకోవాలి, వేపుకున్న వంకాయ ముక్కలని పక్కకు తీసుకోవాలి .
  2. అదే నూనె లో ఆవాలు, జీలకర్ర, ఇంగువా, అల్లం వెల్లూలీ తరుగు వేసి వేపుకోవాలి.
  3. ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపి, టొమాటో, పచ్చిమిర్చి తరుగు వేసి టొమాటో గుజ్జుగా అయ్యేదాకా వేపుకోవాలి .
  4. పసుపు ధనియాల పొడి ఉప్పు కారం వేసి వేపుకోవాలి.
  5. మెంతి కూర సన్నిని తరుగు వేసి ఆకు మాగీ నూనె పైకి తేలే దాకా వేపుకోవాలీ .
  6. ఆకు వేగిన తరువాత వేపుకున్న వంకాయ ముక్కలు వేసి మరో 3 నిమిషాలు వేపి దింపేసుకోండి.