వేరుశెనక్కాయలు – పిడికెడు (కనీసం 2 గంటలు నానాబెట్టాలి)
3
tbsp నూనె
1
tsp ఆవాలు
1
tsp జీలకర్ర
2
చీరిన పచ్చిమిర్చి
2
రెబ్బలు కరివేపాకు
2
ఉల్లిపాయ (మీడియం సైజు)
1/8
tsp పసుపు
2
tbsp కారం
2
tsp ధనియాల పొడి
కొత్తిమీర – చిన్న కట్ట
2
tbsp నిమ్మ రసం
4
టొమాటో
5
వెల్లులి
1
tbsp బెల్లం ముక్క
400
ml నీళ్ళు
ఉప్పు
విధానం
టొమాటోలని వెల్లులిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
నూనె వేడి చేసి అందులో 4 గాట్లు పెట్టిన వంకాయలు వేసి 50% వేపుకుని తీసుకోండి (వంకాయ మగ్గి మెత్తబడాలి)
అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ సన్నని తరుగు, ఉప్పు వేసి ఉల్లిపాయ రంగు మారి మెత్తబడే దాకా మూతపెట్టి వేపుకోవాలి.
ఉల్లిపాయ రంగు మారాక రెండు గంటలు వేడి నీళ్ళలో నానబెట్టిన పల్లీలు వేసి 3 నిమిషాలు వేపుకోవాలి. తరువాత తెల్ల వంకాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి 2 నిమిషాలు వంకాయ ముక్కలు వేపుకోవాలి
2 నిమిషాలకి కారం వేగుతుంది అప్పుడు 100 ml నీళ్ళు పోసి బాగా కలిపి మూతపెట్టి వంకాయ మెత్తగా గుజ్జుగా మగ్గనివ్వాలి
మగ్గిన వంకాయలలో టొమాటో పేస్ట్, 300 ml నీళ్ళు పోసి సన్నని సెగ మీద 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి.
15 నిమిషాల తరువాత చిన్న బెల్లం ముక్క, నిమ్మరసం వేపుకున్న నీలం రంగు వంకాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి 15 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించి దింపేసుకోండి.