నూనే వేడి చేసి అందులో మెంతి కారం కోసం ఉంచిన పదార్ధాలు మెంతులతో మొదలెట్టి ఒక్కోటికా వేసుకుంటూ ఎర్రగా వేపుకుని తీసుకుని మెత్తని పొడి చేసుకోండి.
పచ్చడి కోసం నూనె వేడి చేసి అందులో వంకాయ ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. మగ్గిన వంకాయలో టమాటో ముక్కలు వేసి మెత్తబడే దాకా కలుపుతూ మగ్గబెట్టుకోవాలి.
టొమాటోలు మెత్తబడ్డాక పసుపు చింతపండు పులుసు మెంతి కారం వేసి బాగా కలుపుకోండి. ఆ తరువాత కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి.
ఒక నిమిషం తరువాత మిక్సీలో వేసుకుకోండి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు మూడు సార్లు పల్స్ చేసుకోండి. తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలు వేసి ఎర్రగా వేపి పచ్చడిలో కలుపుకోండి.