నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద 90% ఉడికించుకోవాలి.
90% ఉడకడం అంటే మెతుకు మెదిపితే మెత్తగా నలిగి లోపల కొద్దిగా పలుకుగా ఉన్నది. ఆ స్టేజ్లో అన్నాన్ని తీసి వడకట్టి జల్లేడలో వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి. మిగిలిన 10% అన్నం చల్లారేలోగా ఉడికిపోతుంది.
పాన్లో నూనె నెయ్యి వేసి బాగా వేడి చేసి అందులో దాల్చిన చెక్క, జీలకర్ర వేసి జీలకర్ర చిటచిటలాడించాలి.
జీలకర్ర చిట్లిన వెంటనే మంట తగ్గించి వెల్లులి, ఎండుమిర్చి వేసి వెల్లులి బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
వెల్లులి వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి 30 సెకన్లు వేపుకోవాలి.
తరువాత చల్లారిన అన్నం వేసి అందులో మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి హై-ఫ్లేమ్ మీద అట్లకాడతో టాస్ చేస్తే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది రైస్కి.
టాస్ చేసిన రైస్ని వేడివేడిగా చోలే మసాలా, దాల్ తడ్కా, లేదా పనీర్ కర్రీతో సర్వ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.