బటర్ చికెన్ | చికెన్ మఖాని

Restaurant Style Recipes | nonvegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 40 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ నానబెట్టడానికి
  • 350 gms బోన్లెస్ చికెన్
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/2 చెక్క నిమ్మరసం
  • ఉప్పు – కొద్దిగా
  • 2 tbsp ఆవ నూనె
  • 1/4 tsp నల్ల ఉప్పు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp కారం
  • 1 tsp కాశ్మీరీ కారం
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1/2 tsp కసూరి మేథి
  • 4 tbsp గడ్డ పెరుగు
  • 1/2 tsp యాలకల పొడి
  • 1/2 tsp ఆంచూర్ పొడి
  • గ్రేవీ కోసం
  • 4 టొమాటో (250 gms)
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • బిర్యానీ ఆకు – సగం
  • 1/2 ఇంచు అల్లం
  • 5 వెల్లులి
  • ఉప్పు
  • 1/4 tsp పంచదార
  • 15 జీడిపప్పు
  • 1/2 cup ఉల్లిపాయ చీలికలు
  • 3 tbsp హెరిటేజ్ బటర్
  • 4 కాశ్మీరీ మిరపకాయలు
  • 1/2 tsp మిరియాలు
  • 250 ml నీళ్ళు
  • చికెన్ గ్రిల్ చేయడానికి
  • 1 tbsp నూనె
  • 1 tsp బటర్
  • చికెన్ కర్రీ కోసం
  • 2 tbsp నూనె
  • 3 tsp బటర్
  • 1 tsp కాశ్మీరీ కారం
  • 1 tsp కారం
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 400 ml నీళ్ళు
  • సాల్ట్
  • 1 tsp కసూరి మేథి
  • 2 tsp బటర్
  • 3 tbsp ఫ్రెష్ క్రీమ్
  • 1 tbsp తేనె
  • కాల్చిన కొబ్బరి పెంకులు/ బొగ్గు ముక్కలు
  • 2 చిటికెళ్లు గరం మసాలా
  • 3 బొట్లు నెయ్యి

విధానం

  1. చికెన్ బ్రెస్ట్ని ¼ ఇంచ్ వెడల్పు 80% లోతుగా గాట్లు పెట్టుకోండి. గాట్లు పెట్టుకున్న చికెన్లో అల్లం వెల్లులి పేస్ట్ నిమ్మరసం, ఉప్పు వేసి బాగా రుద్ది పట్టించి పక్కనుంచుకోండి.
  2. మరి గిన్నెలో ఆవ నూనెలో కాశ్మీరీ కారం వేసి గడ్డలు లేకుండా బాగా కలిపి హెరిటేజ్ ప్రీమియం గడ్డ పెరుగు లేదా హంగ్ పెరుగుతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపండి.
  3. తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసిన చికెన్ వేసి మసాలాలు బాగా రుద్ది బాగా రాత్రంతా లేదా నాలుగు గంటలు ఫ్రిజ్లో ఉంచండి.
  4. గిన్నెలో గ్రేవీ కోసం ఉంచిన సామగ్రీ అంతా కలిపి ఒకే సారి వేసి కరిగిన బటర్లో 3 నిమిషాలు వేపుకోండి.
  5. వేగిన టొమాటోలో నీళ్ళు పోసి జీడీపప్పు మెత్తగా అయ్యేదాక సన్నని సెగ మీద మూతపెట్టి ఉడికించుకోండి. తరువాత వెన్నలాంటి పేస్ట్ చేసుకోండి.
  6. చికెన్ గ్రిల్ చేయడానికి గ్రిల్ పాన్ లేదా అట్ల పెనం మీద నూనె బటర్ వేసి కరిగించి నాలుగు గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్లో నానుతున్న చికెన్ ఉంచి హై ఫ్లేమ్ మీద కదపకుండా వదిలేయండి. బోన్లెస్ చికెన్ మాడదు.
  7. 5 నిమిషాల తరువాత చికెన్ తిరగతిప్పి మంట పూర్తిగా తగ్గించి 80% గ్రిల్ చేసుకోవాలి. (80% గ్రిల్ అవ్వడానికి 20 నిమిషాల టైమ్ పడుతుంది) చికెన్ పర్ఫెక్ట్ గ్రిల్ టిప్స్ చూడండి.
  8. గ్రిల్ అయిన చికెన్ని పెద్ద ముక్కలుగా కోసుకోండి.
  9. కర్రీ కోసం పాన్లో నూనె బటర్ వేసి కరిగించి అందులో కాశ్మీరీ కారం, వేయించిన జీలకర్ర పొడి వేసి వేపుకోవాలి.
  10. జల్లెడలో టొమాటో గుజ్జు వేసి వడకట్టి 400 ml నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద నురగ పైకి తేలేదాక ఉడకనివ్వాలి, పొంగుతున్న నురగని తీసేయాలి. తరువాత గ్రేవీని చిక్కబడనివ్వాలి.
  11. చిక్కబడ్డ గ్రేవీలో గ్రిల్ చేసుకున్న చికెన్ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బటర్ పైకి తేలేదాక సన్నని సెగ మీద ఉడికించుకోవాలి.
  12. బటర్ పైకి తేలాక కసూరి మేథి నాలిపి వేసుకోండి, ఇంకా 2 tsp బటర్, 3 tbsp ఫ్రెష్ క్రీమ్, తేనె వేసి బాగా కలిపి కూర మధ్యలో గిన్నె పెట్టి అందులో బొగ్గు ముక్క పెట్టి దాని మీద గరం మసాలా, నెయ్యి బొట్లు వేసి మూత పెట్టి సన్నని మంట మీద 3 నిమిషాలు ఉడికించి కప్ తీసేయండి.
  13. తరువాత వేడి వేడి బటర్ చికెన్ పైన కొద్దిగా క్రీమ్తో అలంకరించి రోటీ, నాన్తో సర్వ చేసుకోండి.