కేరట్ మెంతికూర పచ్చడి

Curries | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 15 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • తాలింపు
  • 2 tbsp నూనె
  • 1 tsp జీలకర్ర
  • 10 వెల్లులి
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tsp ఆవాలు
  • 3 ఎండుమిర్చి
  • పచ్చడి కోసం
  • 250 gms క్యారెట్ తురుము
  • 3 పచ్చిమిర్చి
  • 2 మెంతి కూర ఆకులు – చిన్నవి రెండు కట్టలు
  • 2 tsp నూనె
  • ఉప్పు
  • 1 tsp బెల్లం

విధానం

  1. నూనె వేడి చేసి తాలింపు సామాను అంతా వేసి ఎర్రగా వేపుకోవాలి.
  2. వేగిన తాళింపుని తీసి బరకగా రుబ్బుకోవాలి.
  3. మిగిలిన నూనెలో క్యారెట్ తురుము పచ్చిమిర్చి వేసి వేపుకుని తీసుకోండి.
  4. ఇంకొంచెం నూనె వేసి మెంతి కూరని బాగా వేపుకుని తీసుకోండి.
  5. మిక్సీలో వేపుకున్న క్యారెట్ తురుము, వేపిన మెంతి కూర, గ్రైండ్ చేసుకున్న తాలింపు, ఉప్పు, బెల్లం వేసి బరకగా రుబ్బుకుని తీసుకోండి (నచ్చితే కొద్దిగా చింతపండు వేసుకోండి).