కేటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ | క్యాబేజీ పకోడి రెసిపీ | క్యాబేజీ పకోడీ

Street Food | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 350 gms క్యాబేజీ
  • 2 పచ్చిమిర్చి
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • ¼ tsp పసుపు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • ½ tsp జీలకర్ర పొడి
  • 1 cup శెనగపిండి
  • 2 tbsp బియ్యం పిండి
  • 2 sprigs కరివేపాకు (2 రెమ్మలు)
  • నూనె (వేపుకోడానికి)

విధానం

  1. క్యాబేజీ మధ్యన ఉన్న దుంపని తీసేయండి. తరువాత సన్నగా తరుక్కుని పక్కనుంచుకోండి.
  2. తరుక్కున్న కేబేజీలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 30 నిమిషాలు వదిలేస్తే క్యాబేజీ లోంచి నీరు దిగుతుంది.
  3. నీరు వదిలిన క్యాబేజీ ని గట్టిగా పిండి నీరంతా తీసేయండి.
  4. నీరు పిండిన క్యాబేజీ లో ముందుగా మసాలా పొడులు, ఉప్పు ,అల్లం వెల్లులి ముద్దా వేసి కలుపుకుంటే కాస్త నీరు వస్తుంది.
  5. కొద్దిగా నీరు వదిలిన క్యాబేజీలో శెనగపిండి, బియ్యం పిండి, కరివేపాకు వేసి గట్టిగా పిండుతూ కలుపుకోకుండా పిండిని ఒక దగ్గరికి చేర్చుతున్నట్లుగా తడిపొడిగా కలుపుకోవాలి.
  6. తడిపొడిగా పిండి కలుపుకున్న తరువాత మరిగే వేడి నూనె లో పిండిని చిన్న గోలీ సైజు ఉండలుగా వేసుకోండి.
  7. పకోడీ నూనెలో వేశాక ఒక నిమిషం వదిలేయండి, అప్పుడు పకోడీ గట్టిపడుతుంది, ఆ తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకుంటే కరకరలాడుతూ ఉండే పకోడీ వస్తుంది.
  8. వేపుకున్న పకోడీని జల్లెడలో వేసి జాలి కాస్త చల్లారనిస్తే గట్టిపడి కరకరలాడుతూ వస్తాయి పకోడీలు.