కేటరింగ్ స్టైల్ కొత్తిమీర రైస్

Flavored Rice | vegetarian

  • Prep Time 2 Mins
  • Cook Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • కొత్తిమీర పేస్ట్ కోసం
  • 150 gms కొత్తిమీర
  • 75 gm పుదీనా
  • అల్లం – ఇంచ్ ముక్కలు
  • 10 - 12 వెల్లులి
  • 1 ఉల్లిపాయ
  • పసుపు – కొద్దిగా
  • నీళ్ళు
  • రైస్ కోసం
  • 2 cups బాస్మతి బియ్యం
  • 50 ml నూనె
  • 1 tbsp నెయ్యి
  • 10 -15 జీడిపప్పు
  • 2 బిర్యానీ ఆకు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 4 - 5 లవంగాలు
  • 1 tbsp నిమ్మరసం

విధానం

  1. కొత్తిమీర పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. కొత్తిమీర పేస్ట్ ని ఒక బట్టలో వేసి రసాన్ని అంతా పిండేయండి. పిప్పిని పడేయండి.
  3. బాస్మతి బియ్యంలో కొత్తిమీర రసం పిండిన నీరు 4 కప్పులు ఉప్పు వేసి గంట సేపు నానబెట్టుకోండి (మామూలు బియ్యంతో వందలిస్తే టిప్స్ చూడండి).
  4. గిన్నెలో నెయ్యి నూనె వేసి వేడి చేసి జీడిపప్పు వేసి నురగ వచ్చేదాకా వేపుకోండి.
  5. జీడిపప్పు వేగిన తరువాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేపుకోవాలి.
  6. ఆ తరువాత నానిన బియ్యం కొత్తిమీర నీళ్ళతో సహా వేసి నెమ్మదిగా కలిపి హై ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి.
  7. అన్నం ఊదుకుపట్టిన తరువాత బియ్యం మీద పగుళ్ళవస్తాయ్ అప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి మూతపెట్టి కొద్దిగా నీరు మిగిలేదాక వండుకోవాలి.
  8. 80% పైన ఉడికిన తరువాత నిమ్మరసం వేసి కలిపి సిమ్లో మరో 7-8 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేస్తే ఘుమఘుమలాడే కొత్తిమీర రైస్ రెడీ!
  9. ఈ రైస్ చల్లని రైతా లేదా స్పైసీ కర్రీతో చాలా రుచిగా ఉంటుంది.