కాలీఫ్లవర్ సెనగపప్పు కూర

Curries | vegetarian

  • Prep Time 1 Mins
  • Cook Time 25 Mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms కాలీఫ్లవర్ ముక్కలు
  • 1 tbsp నూనె
  • పసుపు (కొద్దిగా)
  • 1/4 Cup పచ్చి సెనగపప్పు
  • గ్రీవీ కోసం:
  • 2 tbsp నూనె
  • 1 tbsp జీలకర్ర
  • 2 tbsp ధనియాలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 ఉల్లిపాయ చీలికలు
  • 1/4 Cup పచ్చి కొబ్బరి ముక్కలు
  • 3 పెద్ద సైజు టమాటో ముక్కలు
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 1/4 tbsp పసుపు
  • కూర కోసం:
  • 1/2 tbsp జీలకర్ర
  • 3 Sprigs కరివేపాకు
  • 1 tbsp నూనె
  • 1.5 Cup నీళ్లు
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. సెనగపప్పుని వేడి నీళ్లలో వేసి నానబెడితే త్వరగా నానుతాయి.
  2. నూనె వేడి చేసి కాలీఫ్లవర్ ముక్కలు పసుపును వేసి 2- 3 నిమిషాలు వేపి తీసుకోండి
  3. ఇంకొద్దిగా నూనె వేసి జీలకర్ర ధనియాలు వేపి పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడనివ్వాలి.
  4. మెత్తబడిన ఉల్లిలో పచ్చికొబ్బరి ముక్కలు వేసి ఒక నిమిషం వేపుకోండి. ఆ తరువాత టమాటో ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి టమాటో పైన స్కిన్ సెపెరేట్ అయ్యాయేదాకా మగ్గించి తీసి మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  5. కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర కరివేపాకు వేసి వేపి రుబ్బుకున్న ఉల్లి కొబ్బరి పేస్ట్, నానబెట్టిన సెనగపప్పు నీళ్లు పోసి కలిపి సెనగపప్పు మెత్తగా మగ్గేదాకా ఉడికించాలి
  6. మెత్తగా ఉడికిన సెనగపప్పులో వేపుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలిపి కాలీఫ్లవర్ మెత్తబడే దాకా వేపి పైన కాస్త తరుగు చల్లి తీసుకోండి