చట్పటా పుచ్చకాయ స్లష్ | పుచ్చకాయ స్లష్ రెసిపీ

Summer Recipes | vegetarian

  • Prep Time 10 Mins
  • Resting Time 120 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 4 cups గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు
  • 6-7 ఐసు ముక్కలు
  • ½ tsp చాట్ మసాలా
  • ¼ tsp బ్లాక్ సాల్ట్
  • ¼ tsp ఉప్పు
  • 2-3 tbsp తేనె
  • 1 tbsp నిమ్మరసం
  • 20 పుదీనా ఆకులు

విధానం

  1. ముందుగా బాగా పండిన పుచ్చకాయని ముక్కలుగా కోసి గింజలు తీసేయండి.
  2. గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలని డీప్ ఫ్రీజర్లో 2 గంటలు ఉంచండి.
  3. రెండు గంట తరువాత ఐసుముక్కలు ఫ్రీజ్ చేసుకున్న పుచ్చ్కాయ ముక్కలు చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, సాల్ట్, తేనె నిమ్మరసం పుదీనా ఆకులు బ్లెండర్లో వేయండి.
  4. సెమీ స్మూత్ మరియు స్లషీ అయ్యే వరకు హై స్పీడ్ మీద బ్లెండ్ చేయండి.
  5. రెఫ్రెషింగ్ స్లష్ ను వెంటనే సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి.