నీళ్ళని మరిగించాలి. నీళ్ళు కాగుతున్నపుడు మైదా తప్ప అన్నీ వేసి నీళ్ళని తెర్లనివ్వండి.
నీళ్ళు తెర్లుతున్నప్పుడు మైదా వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకొండి
వేడి మీదే పిండి బాగా వత్తుకోవాలి, లేదంటే చెకోడీలు సరిగా రావు విరిగిపోతాయ్
వేడి మీదే ఓ తడి గుడ్డ పిండి మీద కప్పి, గుడ్డతో సహా వత్తుతూ పిండిని బాగా కలుపుకొండి, ఇలా చేస్తే సులువుగా ఉంటుంది వేడి మీద వత్తుకోవడానికి
పిండి బాగా కలుపుకున్నాక కారప్పూస గిద్దలో పెద్ద రంద్రాలుండే మౌల్ద్ పెట్టి లోపల నెయ్యి రాసి పిండి ముద్ద ఉంచి పూర్తిగా ఓ ప్లేట్ లో, లేదా బల్ల మీద వత్తుకోండి.
ఇప్పుడు వత్తుకున్న వాటిని వెలికి చుట్టుకుని అంచులని సీల్ చేస్తూ చిన్న చిన్న రింగ్స్ గా చేసుకోండి. వీటిని గాలికి 30 నిమిషాలు ఆరనివ్వండి.
ఇలాగే అన్నీ రెడీ చేసుకోండి. మౌల్ద్ లేకపోతే చేత్తోనే ముందు పిండిని పొడవుగా సన్నగా వత్తుకుని తరువాత రింగ్స్ గా చేసుకోండి.
ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక స్టవ్ ఆపేసి నూనెలో ఓ చిల్లుల గరిట పెట్టి దాని మీద కొన్ని చేగోడీలు వేసుకోండి.
ఆ గరిట ఓ నిమిషం పాటు నూనె లోనే ఉంచి హై-ఫ్లేం మీద వేగనివ్వండి చెగోడీలని(వేపే టిప్స్ టిప్స్ లో వివరంగా ఉండి చూడగలరు).
గరిట తీసేసి చేగోడీలను హై ఫ్లేం మీద 3-4 నిమిషాలు వేగనివ్వాలి.
ఎర్రగా వేగాక చిల్లుల బుట్ట లేదా టిష్యూ నాప్కిన్ మీద తీసుకోండి. పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకోండి