చెట్టినాదు మసాలా కోసం ఉంచిన పదార్ధాలు అన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
ఉల్లిపాయ బంగారు రంగులోకి వేగాక టొమాటో ముక్కలు, పుదీనా కొత్తిమీర వేసి టొమాటో ముక్కలు మగ్గి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
వేగిన మసాలాలో మసల పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద అడుగు పట్టకుండా నూనె పైకి తేలి ముదురు ఎరుపు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
మగ్గిన టొమాటోలో చికెన్ ముక్కలు చిలికిన పెరుగు లో మసాల పేస్ట్ వేసి కలిపి చికెన్లో పోసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ రసం పిండి చికెన్ల్కి మసాలాలు పట్టించి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికిస్తే 50% ఉడికిపోతుంది.
50% ఉడికిన చికెన్లో నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి. ఉడుకుతున్న ఎసరులో ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు గంటసేపు నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషఅలౌ ఉడికిస్తే 60% ఉడుకుతుంది.
60% ఉడికిన అన్నాన్ని నెమ్మదిగా మెతుకు విరగకుండా కలిపి మూతపెట్టి సన్నని సెగ మీద 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేస్తే చాలు. ఘుమఘుమలాడే స్పైసీ చెట్టినడు చికెన్ బిర్యానీ తయారు.
చెట్టినాడు చికెన్ బిర్యానీ ఉడికిన కోడి గుడ్డు, చల్లని రైతాతో ఎంతో రుచిగా ఉంటుంది.