చెట్టినాడు ఆలూ ఫ్రై

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 20 Mins
  • Total Time 25 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kg ఉడికిన్చుకున్న బంగాలదుంప ముక్కలు
  • 1/4 cup నూనె
  • 1/4 spoon పసుపు
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 రెబ్బ కరివేపాకు
  • మసాలా పొడి కోసం
  • 2 tsps ధనియాలు
  • 1 tbsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp సోంపు
  • 1 inch దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 1 అనాస పువ్వు
  • మరాటి మొగ్గ (సగం ముక్క)
  • 6 ఎండుమిర్చి

విధానం

  1. మసాలా కోసం ఉంచిన సామానంతా వేసి లో-ఫ్లేం మీద ఎర్రగా మంచి సువాసనోచ్చెంత వరకు వేపి కాస్త బరకగా పొడి చేసుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, పసుపు వేసి వేపి ఉడికించి ముక్కలుగా చేసుకున్న బంగాళా దుంపల ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద క్రిస్పీగా వేపుకోండి.
  3. బంగాలదుంపలు మీడియం ఫ్లేం మీద మూత పెట్టకుండా వేపుకోండి, ఎర్రగా వేగడానికి కనీసం 20 నిమిషాలు పైన టైం పడుతుంది.
  4. ఎర్రగా వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలుపుకుని ౩-4 నిమిషాలు వేపుకుని దిమ్పెసుకోవడమే.