చెట్టినాడు స్పెషల్ బెండకాయ మండి

Curries | vegetarian

  • Prep Time 5 Mins
  • Cook Time 17 Mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2.5 tbsp నూనె
  • 300 gms బెండకాయ ముక్కలు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • 1/2 tsp ఆవాలు
  • మెంతులు – చిటికెడు
  • 100 ml చింతపండు పులుసు (నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
  • 4 ఎండుమిర్చి
  • 6 - 7 వెల్లులి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 10 - 12 సాంబార్ ఉల్లిపాయలు
  • 1/4 cup ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 400 ml బియ్యం కడుగు నీళ్ళు

విధానం

  1. కొద్దిగా నూనె వేడి చేసి అందులో బెండకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు బాగా టాస్ చేసి మూత పెట్టి బెండకాయ రంగు మారే దాకా వేపుకోవాలి. అప్పుడు గిజురు వదులుతుంది.
  2. వేగిన బెండకాయ ముక్కలని పక్కన ఉంచుకోండి.
  3. అదే మూకుడులో ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రబడనివ్వాలి. తరువాత మినపప్పు వేసి వేపుకోవాలి.
  4. తాళింపులు వేగిన తరువాత ఎండుమిర్చి వెల్లులి కరివేపాకు వేసి వెల్లులి రంగు మారేదాకా వేపుకోవాలి.
  5. సాంబార్ ఉల్లిపాయలు సన్నని ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ రంగు మారి మెత్తబడేదాకా వేపుకోవాలి.
  6. వేగిన ఉల్లిపాయాలో చింతవనడు పులుసు పోసి ఒక పొంగు రానివ్వాలి. పొంగిన పులుసులో వేపిన బెండకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
  7. ఉడికిన బెండకాయ ముక్కల్లో బియ్యం కడుగు నీళ్ళు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు ఉడికించి రుచి చూసి కావలిస్తే ఉప్పు వేసి దింపేసుకోవాడమే.
  8. ఈ బెండకాయ మండి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.