సుక్కా మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటిగా వేసుకుంటూ మాంచి సువాసన వచ్చేదాకా మాడకుండా లో - ఫ్లేమ్ మీద వేపి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోండి.
నూనె వేసి చేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. చిట్లుతున్న నూనెలో ఉల్లి చీలికలు, కరివేపాకు పచ్చి మిర్చి చీలికలు ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడేదాకా వేపుకోవాలి.
మెత్తబడిన ఉల్లిపాయల్లో ఉప్పేసిన నీళ్లలో నానబెట్టిన చికెన్ వేసి కలిపి హాయ్ ఫ్లేమ్ మీద నీరు వదిలేదాకా వేపుకోవాలి.
చికెన్ 10 నిమిషాలకి నీరు వదిలేసి నూనె తేలడం మొదలవుతుంది. అప్పుడు అల్లం వెల్లులి పేస్ట్ నిమ్మరసం వేసి బాగా అల్లం వెల్లులి ముద్దని వేపుకోండి.
వేగిన చికెన్లో పొడి చేసి ఉంచుకున్న సుక్కా మసాలా పొడి బాగా కలపండి, ఆ తరువాత పసుపు పెరుగు వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలేదాకా మీడియాయ్మ్ ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
ప్రతీ 3 నిమిషాలకి ఒక సారి మూత తీసి అడ్డుపడుతున్న మసాలాని గీరి కలిపి మూత పెట్టి వేపుకోవాలి.
సుమారుగా సుక్కా మసాలా పొడి వేసిన 16 నిమిషాలు మూత పెట్టి వేపిన తరువాత చికెన్లోంచి నూనె పైకి తేలుతుంది. అప్పుడు కొద్దిగా బెల్లం, మిరియాల పొడి కొత్తిమీర వేసి కలిపి మరో 5 నిమిషాలు మూత తీసి వేపితే ఘుమఘుమలాడే తమిళనాడు స్టైల్ సుక్కా మసాలా తయార్.
సుక్కా మసాలా స్టారర్గా లేదా సాంబార్, రసం అన్నంతో నంజుకు తినడానికి చాలా రుచిగా ఉంటుంది.