చికెన్ హలీమ్ | హైదరాబాద్ స్టైల్ చికెన్ హలీమ్ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి

| nonvegetarian

  • Prep Time 10 Mins
  • Cook Time 60 Mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ ఉడికించడానికి
  • 1/2 Kilo బోన్లెస్ చికెన్
  • 4 tbsp నెయ్యి
  • 1/2 cup జీడిపప్పు
  • 1/4 cup బాదం పప్పు
  • 10 - 15 పిస్తా పప్పు
  • 2 inches దాల్చిన చెక్క
  • 1 నల్ల యాలక
  • 4 యాలకలు
  • 5 లవంగాలు
  • 1 tsp మిరియాలు
  • 1 tsp పత్తర్ ఫూల్
  • 1 tsp షాహీ జీరా
  • 1 tsp తోక మిరియాలు(kebab cheeni )
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 6 పచ్చిమిర్చి
  • 2 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • 1.5 tsp కారం
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1/2 cup చిలికిన పెరుగు
  • కొత్తిమీర తరుగు – చిన్న కట్ట
  • పుదీనా తరుగు – చిన్న కట్ట
  • 750 ml నీళ్ళు
  • డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కోసం
  • వేపుకున్న జీడిపప్పు కొంచెం
  • వేపుకున్న బాదం
  • వేపుకున్న పిస్తా
  • 1/2 cup పెరుగు
  • నానబెట్టాల్సిన పప్పులు
  • 1/3 cup గోధుమ నూక
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 1 tsp ఎర్ర కందిపప్పు
  • 1 1/2 tbsp ఒట్స్/ బార్లీ
  • 1 tsp పెసరపప్పు
  • 1 tbsp బియ్యం
  • నీళ్ళు
  • 1 tbsp మినపప్పు
  • 1 tsp నువ్వులు
  • హలీమ్ తయారీ కోసం
  • 1 cup నీళ్ళు
  • 1/4 cup పాలు
  • 2 tbsp ఎండిన గులాబీ రేకులు
  • 1/4 cup పుదీనా తరుగు
  • 1/4 cup కొత్తిమీర తరుగు
  • 1.5 tbsp గరం మసాలా
  • 1/3 cup నెయ్యి
  • 1 cup వేపుకున్న ఉల్లిపాయ తరుగు
  • జీడిపప్పు, బాదం పేస్ట్
  • నానబెట్టిన పప్పుల పేస్ట్

విధానం

  1. హలీమ్ కోసం నానబెట్టాల్సిన పప్పులు అన్నీ నీళ్ళు పోసి నాలుగు గంటలు నానాబెట్టాలి.
  2. నాలుగు గంటలు నానిన పప్పులని వడకట్టి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  3. కుక్కర్లో నెయ్యి కరిగించి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి తీసుకోండి
  4. అదే నెయ్యి లో మసాలా దీనుసులు వేసి 30 సెకన్లు వేపి, ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి
  5. ఉల్లిపాయలు ఎర్రబడ్డాక అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపి, చికెన్ వేసి 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి.
  6. తరువాత మిగిలిన మసాలాలూ, పుదీనా కొత్తిమీర చిలికిన పెరుగు వేసి మరో 2 నిమిషాలు వేపుకోవాలి. తారువాత నీళ్ళు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 కూతలు వచ్చే దాకా ఉడికించుకోవాలి
  7. మెత్తగా ఉడికిన చికెన్ని పప్పుగుత్తితో మెత్తగా ఏనుపుకోవాలి
  8. వేపుకున్న జీడిపప్పు లోంచి కొంత, బాదం, పిస్తా పప్పులు మొత్తం, పెరుగు వేసి మెత్తని పేస్ట్ చేసి ఉంచుకోండి
  9. అడుగుమందంగా ఉన్న గిన్నెలో నెయ్యి పోసి అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పప్పులు కాసిని నీళ్ళు పోసి బాగా కలిపి తరువాత పొయ్యి మీద పెట్టి చిక్కని జావాలా అయ్యేదాకా గడ్డలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. దీనికి కనీసం 15 నిమిషాలు పడుతుంది
  10. జావా చిక్కగా అయ్యాకా ఎనుపుకున్న చికెన్ వేసి పప్పు గుత్తి తో కలుపుతూ ఎనుపుతూ ఉండాలి.
  11. 15 నిమిషాలు ఎనిపిన తరువాత డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి మరో 15 నిమిషాలు ఏనుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద
  12. 30 నిమిషాల తరువాత గరం మసాలా, ¼ కప్పు నెయ్యి, మరో 15 నిమిషాలు ఏనుపుకోవాలి
  13. 45 నిమిషాల తరువాత వేపుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, మరో 15 నిమిషాలు ఏనుపుకోండి
  14. గంట తరువాత ఎండిన గులాబీ రేకులు లేదా 1 తబసప రోజ్ వాటర్ ¼ కప్పు పాలు పోసి మరో 5 నిమిషాలు ఏనుపుకుని పైన 2 tbsp నెయ్యి వేసి కలిపి దింపేసుకోవాలి
  15. సర్వ్ చేసే ప్లేట్లో హలీమ్ వేసి పైన కొద్దిగా నెయ్యి, వేపుకున్న జీడిపప్పు, వేపుకున్న ఉల్లిపాయ తరుగు, నిమ్మకాయ, ఉడికించిన గుడ్డు పెట్టి సర్వ్ చేసుకోండి